ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 28, 2020 , 10:18:23

సెల్ఫ్ హెల్ప్ గురు కీత్‌కు 120 ఏళ్ల జైలుశిక్ష‌

సెల్ఫ్ హెల్ప్ గురు కీత్‌కు 120 ఏళ్ల జైలుశిక్ష‌

హైద‌రాబాద్‌:  అమెరికాలో లైంగిక నేరాల‌కు పాల్ప‌డిన సెల్ఫ్ హెల్ప్ గురు కీత్ రానిరీకి 120 ఏళ్ల జైలుశిక్షను విధించారు. న్యూయార్క్ జ‌డ్జి మంగ‌ళ‌వారం ఈ తీర్పును వెలువ‌రించారు.   నెక్సిమ్‌(ఎన్ఎక్స్ఐవీఎం) సంస్థ‌ను స్థాపించిన కీత్‌.. అనేక మంది భ‌క్తుల‌ను లైంగికంగా వ‌శ‌ప‌రుచుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన కీత్‌.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన మ‌హిళ‌ల‌ను లైంగికంగా లొంగ‌దీస్తున్న‌ట్లు కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. అయిదు రోజుల సెల్ఫ్ హెల్ప్ కోర్సు కోసం అయిదు వేల డాల‌ర్ల డీల్ కుదుర్చుకున్న కీత్‌.. ఆ త‌ర్వాత ఆర్థికంగా, లైంగికంగా మ‌హిళ‌ల్ని వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.   మ‌హిళ‌ల‌ను బానిస‌లుగా చేసుకున్న కీత్‌.. వారితో శృంగారానికి పాల్ప‌డిన‌ట్లు కేసు న‌మోదు అయ్యింది.  గ‌త ఏడాది జూన్‌లో కీత్‌ను దోషిగా తేల్చారు. సెక్స్ ట్రాఫికింగ్‌, ఎక్స్‌టార్ష‌న్‌, క్రిమిన‌ల్ కాన్స్పిరెసీ కేసుల్లో అత‌న్ని అరెస్టు చేశారు. బ్రూక్లిన్ కోర్టు జ‌డ్జి నికోల్ గారౌఫిస్ కేసులో మ‌హిళల‌ వాంగ్మూలాల‌ను తీసుకున్నారు. కీత్ రానిరీ 1998లో నెక్సీమ్‌ను స్టార్ట్ చేశారు. వ్య‌క్తిత్వ వికాస కోర్సు పేరుతో కీత్ అత్యంత క్రూర‌మైన‌, హేయ‌మైన దారుణాల‌కు  పాల్ప‌డిన‌ట్లు జ‌డ్జి త‌న తీర్పులో పేర్కొన్నారు.