శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 09:36:16

ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య రెండ‌వ డిబేట్ ర‌ద్దు..

ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య రెండ‌వ డిబేట్ ర‌ద్దు..

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌,  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన రెండ‌వ డిబేట్ ర‌ద్దు అయ్యింది.  అక్టోబ‌ర్ 15వ తేదీన జ‌ర‌గాల్సిన ఆ చ‌ర్చ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌మిష‌న్ ఆన్ ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  వ‌ర్చువ‌ల్ ఫార్మాట్‌లో తాను పాల్గొన‌బోన‌ని ట్రంప్ వెల్ల‌డించ‌డంతో  క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఇక చివ‌రి డిబేట్ ఈనెల 22వ తేదీన టెన్నిసెసిలో జ‌ర‌గాల్సి ఉంది.  న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అధ్య‌క్షుడు ట్రంప్ క‌రోనా వైర‌స్ పాజిటివ్ తేల‌డంతో.. ఈనెల 15వ తేదీన జ‌ర‌గాల్సిన డిబేట్‌ను వ‌ర్చువ‌ల్‌గా మారుస్తున్న‌ట్లు ఇటీవ‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. కానీ ట్రంప్ ఆ ప్ర‌తిపాద‌న వ్య‌తిరేకించ‌డంతో రెండ‌వ డిబేట్‌ను ర‌ద్దు చేశారు. ఒక‌వేళ ట్రంప్‌కు ఇంకా వైర‌స్ ఉంటే, తాను రెండ‌వ డిబేట్‌లో పాల్గొనేదిలేద‌ని బైడెన్ తెలిపారు. వాల్ట‌ర్ రీడ్ మిలిట‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకున్న త‌ర్వాత వైట్‌హౌజ్‌కు చేరిన ట్రంప్ త్వ‌ర‌లో లైవ్ ఈవెంట్‌లో పాల్గొన‌నున్నారు.