శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 06:39:02

మాస్కులపై వారం పాటు వైరస్‌!

మాస్కులపై వారం పాటు వైరస్‌!

బీజింగ్‌ : సర్జికల్‌ మాస్కుల పట్ల జాగ్రత్త వహించాలని యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌(హెచ్‌కేయూ) పరిశోధకులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వీటిపై వారం రోజులకు పైగా ఉంటున్నదని పేర్కొన్నారు. గది ఉష్ణోగ్రత వద్ద వివిధ ఉపరితలాలపై 3 గంటల నుంచి వారం పాటు ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాగితం, టిష్యూ పేపర్‌పై 3 గంటల్లోనే వైరస్‌ మాయమవుతుండగా, దుస్తులు, చెక్క వస్తువులపై రెండు రోజులు, గాజు, కరెన్సీ నోట్లపై 2 నుంచి 4 రోజులు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌పై 4-7 రోజుల పాటు వైరస్‌ ఉంటున్నట్లు చెప్పారు.


logo