సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 14, 2020 , 13:43:53

కింద పడినా.. పాట ఆపలేదు!

కింద పడినా.. పాట ఆపలేదు!

ఆమె పేరు మోసిన రష్యన్‌ సింగర్‌. స్టేజ్‌ ఎక్కితే పాట.. కు తగ్గట్టు డ్యాన్సు చేసి అదరగొడుతుంది. కానీ పాడుతూ పాడుతూ కింద పడిపోయింది. అంతా అయ్యో అని నోరెళ్లబెట్టారు. కానీ ఆమె మాత్రం పాటను ఆపకుండా అదే ఊపుతో కొనసాగించింది. 

అనాస్తాసియా విస్నెవ్స్‌కయా రష్యాలోని క్రాస్నోయార్క్స్‌లో ఒక ఈవెంట్‌లో పాల్గొన్నది. ఆ కార్యక్రమానికి అందరూ మహిళలే హాజరయ్యారు. మహిళా సాధికారత గురించి ఆమె ఒక పాట పాడాల్సిందిగా అందరూ కోరడంతో పాట అందుకుంది అనాస్తాసియా. ఊపు మీదున్న పాటలో మునిగిపోయి వేదికపై నుంచి మూడు మీటర్ల లోతులో పడిపోయింది. అయినా తన పాటను మాత్రం ఆపలేదు. రెట్టించిన ఉత్సహంతో పాడింది. ఆశ్చర్యపోయిన అందరూ ఆమె పట్టుదలకు చప్పట్లతో ప్రశంసలు అందించారు. సింగర్‌ పడిన వెంటనే మ్యుజీషియన్‌ చేయందించి ఆమెను పైకి లేపాడు. పాట మొత్తం అయిపోయాక ఆమె హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంది. ఈ వార్త వైరల్‌ అవుతూ న్యూస్‌ వెబ్‌సైట్‌ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. logo