ఆదివారం 17 జనవరి 2021
International - Nov 25, 2020 , 14:54:20

చ‌రిత్ర సృష్టించిన స్కాట్లాండ్‌.. మ‌హిళ‌ల‌కు ఉచితంగా నెల‌స‌రి ఉత్ప‌త్తులు

చ‌రిత్ర సృష్టించిన స్కాట్లాండ్‌.. మ‌హిళ‌ల‌కు ఉచితంగా నెల‌స‌రి ఉత్ప‌త్తులు

స్కాట్లాండ్ చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల‌కు ఉచితంగా నెల‌స‌రి ఉత్ప‌త్తుల‌ను ఇచ్చే బిల్లుకు అక్క‌డి పార్ల‌మెంట్ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్ర‌పంచంలో ఇలాంటి చ‌ట్టం చేసిన తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. ఈ పీరియ‌డ్ ప్రోడ‌క్ట్స్ బిల్లు ఆమోదం పొంద‌డంతో ఇక నుంచి ప‌బ్లిక్ బిల్డింగ్‌ల‌లో శానిట‌రీ ఉత్ప‌త్తుల‌ను ఉచితంగా పొందే హ‌క్కు అక్క‌డి మ‌హిళ‌ల‌కు వ‌చ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న చ‌ట్టం ఇప్పుడు వ‌చ్చింద‌ని ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఎంఎస్‌పీ మోనికా లెన‌న్ అన్నారు. ఇంత వ‌ర‌కూ స్కాట్లాండ్‌లో విద్యార్థినుల‌కు శానిట‌రీ ఉత్ప‌త్తుల‌ను ఉచితంగానే అందించే వారు. అయితే దేశంలోని అంద‌రు మ‌హిళ‌ల‌కు వీటిని ఉచితంగా అందించాల‌ని తాజా బిల్లు ప్ర‌తిపాదించింది. ఇక మీద‌ట దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్సిటీలు అన్నీ టాయిలెట్ల‌లో శానిట‌రీ ఉత్ప‌త్తుల‌ను క‌చ్చితంగా అందుబాటులో ఉంచాలి. ఈ నిర్ణ‌యాన్ని స్కాట్లాండ్ ఫ‌స్ట్ మినిస్ట‌ర్ నికోలా స్టర్గ‌న్ స్వాగ‌తించారు. ఇలాంటి బిల్లుకు ఓటు వేసినందుకు చాలా గ‌ర్వంగా ఉంద‌ని ఆమె అన్నారు.