శనివారం 06 మార్చి 2021
International - Jan 17, 2021 , 15:30:11

అవును.. ఆ గ‌బ్బిలాలు మ‌మ్మ‌ల్ని కుట్టాయి.. వాటి వ‌ల్లే క‌రోనా!

అవును.. ఆ గ‌బ్బిలాలు మ‌మ్మ‌ల్ని కుట్టాయి.. వాటి వ‌ల్లే క‌రోనా!

వుహాన్‌: ప‌్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్‌లోనే పుట్టింద‌ని చాలా మంది ఆరోపిస్తున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికా కూడా ఇవే వాద‌న‌లు వినిపించింది. కానీ చైనా మాత్రం అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లంటూ కొట్టిపారేస్తూ వ‌చ్చింది. అయితే ఆ అనుమానాలు, ఆరోప‌ణ‌లే నిజ‌మ‌ని తాజాగా తేలింది. ఆ వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సైంటిస్టులే ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఓ గుహ‌లో ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో త‌మ‌ను క‌రోనా వైర‌స్ సోకిన గ‌బ్బిలాలు కుట్టాయ‌ని వాళ్లు చెప్పారు. ఈ సంచ‌ల‌న విష‌యాన్ని తైవాన్ టైమ్స్ వెల్ల‌డించింది. 2017లో ఈ ల్యాబ్‌కు చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు ఓ గుహ‌లోకి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వివ‌రించింది. 

ఇందులో ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ.. ఆ స‌మ‌యంలో ఓ గ‌బ్బిలం తాను చేతికి వేసుకున్న ర‌బ్బ‌ర్ గ్లోవ్స్ లోపలికి వెళ్లి కుట్టిన‌ట్లు చెప్పారు. తాము ఆ గుహ‌లో కొన్ని శాంపిల్స్ సేక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. గబ్బిలాల‌పై చేతుల‌కు క‌నీసం గ్లోవ్స్ లేకుండా పరిశోధ‌న‌లు నిర్వ‌హించామ‌ని, మాస్క్‌లు లేకుండా వైర‌స్‌ల‌ను ప‌రీక్షించిన‌ట్లు కూడా ఆ ల్యాబ్ సిబ్బంది వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఇవ‌న్నీ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంది. ప్ర‌స్తుతం క‌రోనా మూలాల కోసం డ‌బ్ల్యూహెచ్‌వోకు చెందిన 13 మంది స‌భ్యుల బృందంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. 

VIDEOS

logo