గురువారం 28 జనవరి 2021
International - Dec 19, 2020 , 06:29:36

అందుకే మహి‌ళల్లో కరోనా తక్కువ!

అందుకే మహి‌ళల్లో కరోనా తక్కువ!

టొరొంటో: క‌రోనా మర‌ణాలు పురు‌షు‌లతో పోలిస్తే, మహి‌ళల్లో తక్కు‌వగా ఉండ‌టా‌నికి గల కార‌ణాల్ని కెనడా శాస్త్ర‌వే‌త్తలు కను‌గొ‌న్నారు. పురు‌షుల కంటే మహి‌ళల్లో లైంగిక హార్మోన్లు, క్రోమో‌జోన్లు ఎక్కు‌వగా ఉంటా‌యని, దీంతో వైర‌స్‌ను ఎదు‌ర్కొనే రోగ‌ని‌రో‌ధక శక్తి మహి‌ళల్లో ఎక్కు‌వగా ఏర్ప‌డు‌తుం‌దని కెన‌డా‌లోని యూని‌వ‌ర్సిటీ ఆఫ్‌ ఆల్బర్టా శాస్త్ర‌వే‌త్తలు తెలి‌పారు. గుండె, ఊపి‌రి‌తి‌త్తులు, మూత్ర‌పిం‌డా‌లకు సంబం‌ధిం‌చిన వ్యాధు‌లను అడ్డు‌కునే ‘ఏస్‌2’ అనే ఎంజై‌మ్‌కు చెందిన క్రోమో‌జో‌మ్‌లు మహి‌ళల్లో రెండు ఉంటా‌యని, పురు‌షుల్లో ఒకటే ఉంటుం‌దని తెలి‌పారు. ‘సా‌ర్స్‌–‌కోవ్‌–2 వైర‌స్‌’ను కట్ట‌డికి ఈ ఎంజైమ్‌ సాయ‌ప‌డు‌తు‌న్న‌ద‌న్నారు.


logo