ఆదివారం 29 మార్చి 2020
International - Feb 28, 2020 , 17:10:32

గెలాక్సీలో మ‌హావిస్పోట‌నం..

గెలాక్సీలో మ‌హావిస్పోట‌నం..

హైద‌రాబాద్‌:  బిగ్‌బ్యాంగ్ త‌ర‌హాలో.. విశ్వంలో మ‌రో మ‌హావిస్పోట‌నం జ‌రిగింది.  ఆ మ‌హాపేలుడుకు సంబంధించిన ఆధారాల‌ను తాజాగా ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.  విశ్వం పుట్టుక స‌మ‌యంలో ఏర్ప‌డిన బిగ్ బ్యాంగ్ విస్పోట‌నం త‌ర‌హాలోనే.. ఓ పాల‌పుంతలో అంత‌క‌న్నా రెట్టింపు పేలుడు జ‌రిగిన‌ట్లు తేల్చారు.  భూమి నుంచి ల‌క్ష‌ల(390 మిలియ‌న్‌) కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న ఓ అతి భారీ కృష్ణ‌బిల్హంలో ఈ మ‌హావిస్పోట‌నం జ‌రిగింది.  ఈ భారీ విస్పోట‌నం వ‌ల్ల ఓఫియ‌స్ గెలాక్సీ స‌మూహంలో పెను మార్పు చోటుచేసుకున్న‌ది.  శాస్త్ర‌వేత్త‌ల అంచ‌నా ప్ర‌కారం.. బిగ్ బ్యాంగ్ పేలుడు క‌న్నా సుమారు అయిదు రేట్లు అధికంగా శ‌క్తి విడుద‌లైన‌ట్లు చెప్పారు.  క‌ర్టిన్ యూనివ‌ర్సిటీలోని ప్రొఫెస‌ర్ మిలానీ జాన్స్‌ట‌న్ హోలిట్ త‌న స్ట‌డీలో ఈ విష‌యాన్ని తెలిపారు. అత్యంత శ‌క్తివంత‌మైన రీతిలో విస్పోట‌నం జ‌రిగినట్లు ఆయ‌న త‌న నివేదిక‌లో వివ‌రించారు.  గెలాక్సీలో పేలుడు చాలా నెమ్మ‌దిగా సాగింద‌ని, స్లో మోష‌న్‌లో చూస్తే అది వంద‌ల మిలియ‌న్ల ఏళ్లు ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తుంద‌న్నారు.  పేలుడు వ‌ల్ల ఏర్ప‌డ్డ కుహ‌రం.. అత్యంత భారీగా ఉన్న‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  బ్లాక్‌హోల్ పేలిన త‌ర్వాత ఏర్ప‌డ్డ కుహ‌రంలో సుమారు 15 పాల‌పుంత‌ల‌ను వ‌రుస‌లో పేర్చ‌వ‌చ్చు అని, ఆ పేలుడు అంత భ‌యంక‌రంగా ఉంద‌ని అన్నారు. పురావ‌స్తు శాఖ శాస్త్ర‌వేత్త‌లు డైనోస‌ర‌స్ ఎముక‌లు క‌నుగొన్న‌ట్లు.. ఖ‌గోళ శాస్త్ర‌వేత్తులు ఈ మ‌హావిస్పోట‌నాన్ని గుర్తించిన‌ట్లు ప్రొఫెస‌ర్ జాన్ తెలిపారు.


logo