శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 07:32:58

కొవిడ్‌ సిండ్రోమ్‌.. పిల్లల్లో మార్పులు

కొవిడ్‌ సిండ్రోమ్‌.. పిల్లల్లో మార్పులు

లండన్‌: కొవిడ్‌-19 సంబంధిత సిండ్రోమ్‌తో బాధపడుతున్న చిన్నారుల్లో రోగ నిరోధక వ్యవస్థ ఏ విధంగా మార్పు చెందుతుందో పరిశోధకులు గుర్తించారు. కొవిడ్‌-19 కారణంగా కొంతమంది పిల్లల్లో పీడియాట్రిక్‌ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్‌ (పీఐఎంఎస్‌-టీఎస్‌) తలెత్తుతున్నట్లు బ్రిటన్‌లోకి కింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తెలిపారు. దీనివల్ల రక్తనాళాల్లో మంటతోపాటు గుండె సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. 

ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 25 మంది పిల్లల నమూనాలను సేకరించి వారు ఈ అధ్యయనం చేపట్టారు. ప్రారంభంలో చిన్నారుల్లో సైటోకిన్స్‌ స్థాయిలు పెరిగాయని, అదే సమయంలో రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన లింపోసైట్లు బాగా పడిపోయినట్లు గుర్తించారు. చిన్నారుల కోలుకున్న తర్వాత రోగనిరోధక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి వచ్చినట్లు గుర్తించారు.


logo