శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 12:26:22

32 వేల ఏళ్ల క్రితం నాటి వృక్షానికి మ‌ళ్లీ జీవం పోశారు..

32 వేల ఏళ్ల క్రితం నాటి వృక్షానికి మ‌ళ్లీ జీవం పోశారు..

హైద‌రాబాద్‌: గ్లాస్ జార్‌లో ఉన్న ఈ మొక్క‌ను చూశారా ?  ల్యాబ‌రేట‌రీలో చిగురించిన ఈ పుష్పానికి పెద్ద స్టోరీనే ఉంది.  ఆస్ట్రియాకు చెందిన వృక్ష‌శాస్త్ర‌వేత్త‌లు ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు.  సుమారు 32 వేల ఏళ్ల క్రితం నాటి వృక్షానికి మ‌ళ్లీ ప్రాణం పోశారు.  సైలీన్ స్టెనోఫిల్లా అనే ఈ వృక్షాన్ని ప్ర‌స్తుతం శాస్త్ర‌వేత్త‌లు ఓ ల్యాబ్‌లో పెంచుతున్నారు.  ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నాలో ఉన్న బోకూ యూనివ‌ర్సిటీలో ఈ ప్ర‌యోగం జ‌రిగింది. 

సైలీన్ స్టెనోఫిల్లా మొక్క‌కు చెందిన విత్త‌నాల‌ను ప‌ర్మాఫ్రోస్ట్ నుంచి తీశారు. సుమారు 38 మీట‌ర్ల లోతులో గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన మంచు నుంచి ఈ మొక్క విత్త‌నాల‌ను శాస్త్ర‌వేత్త‌లు బ‌య‌ట‌కు తీశారు. ఈ పురాత‌న వృక్షాన్ని 2012లోనే పెంచే ప్ర‌య‌త్నం చేశారు.  అయితే ఇన్నేళ్ల పాటు ఎలా ఆ విత్త‌నాలు స‌జీవంగా ఉన్నాయో తెలుసుకునేందుకు వాటి జ‌న్యువు అధ్య‌య‌నాన్ని శాస్త్ర‌వేత్త‌లు చేప‌ట్టనున్నారు.   సైబీరియాలోని ఆర్కిటిక్ టుండ్రా ప్రాంత‌లో ఈ పుష్పించే మొక్క‌లు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. వియ‌న్నా వ‌ర్సిటీలో ప్లాంట్ బ‌యోటెక్నాల‌జిస్ట్ ప్రొఫెస‌ర్ మార్గిట్ లైమ‌ర్ ఈ మొక్క‌ను పెంచారు.

 logo