శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 02:09:03

బడిగంటల గణ గణ..

బడిగంటల గణ గణ..

బీజింగ్‌:  కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాలు ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. గతకొంతకాలంగా మూతబడిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నాయి. రెండు వారాలుగా వైరస్‌ కేసులు నమోదుకాకపోవడంతో మంగళవారం చైనాలో విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో బడిబాట పట్టారు. ఇప్పటికే 75 శాతం మంది విద్యార్థులు బడులకు వెళ్తుండగా, మంగళవారం నుంచి మిగిలిన విద్యార్థులు కూడా తరగతులకు హాజరయ్యారు. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌తోపాటు, స్కూల్స్‌ ప్రాంగణాల్లో విద్యార్థులు ముఖానికి మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టారు. వైరస్‌ తొలిసారిగా వెలుగుచూసిన వుహాన్‌ నగరంలో కూడా మంగళవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. ఐదు నెలల లాక్‌డౌన్‌ అనంతరం ఇంగ్లండ్‌లో మంగళవారం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. భౌతికదూరం వంటి నిబంధనలు పాటిస్తూ, ముఖానికి మాస్కులను ధరించి వేలాది మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు హాజరయ్యారు. మరోవైపు, కేసులు పెరుగుతున్నప్పటికీ మంగళవారం ఫ్రాన్స్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 


logo