శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 14, 2020 , 14:01:34

మక్కాలో కరోనా నియంత్రణకు సౌదీ సర్కార్ సతమతం

మక్కాలో కరోనా నియంత్రణకు సౌదీ సర్కార్ సతమతం

హైదరాబాద్: ముస్లింల పవిత్ర నగరమైన మక్కాలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్నది. మక్కాలోని మురికివాడలు, శ్రామిక శిబిరాలు కరోనాకు ఆటపట్టులా తయారయ్యాయి. 20 లక్షల జనాభా కలిగిన మక్కాలో కరోనా కేసుల సంఖ్య సోమవారానికి 1050కి పెరిగింది. అంతకు మూడింతల జనాభా కలిగిన రాజధాని రియాధ్‌లో కరోనా కేసుల సంఖ్య 1,422 గా నమోదైంది. కాందిశీకులు, వలస కార్మికులు నివసించే ఇరుకు బస్తీల్లో కరోనాను అదుపు చేయడం కష్టసాధ్యమైపోతున్నది. సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద భవన నిర్మాణ కంపెనీకి చెందిన ఐదుగురు మక్కా సిబ్బంది కరోనాకు గురికావడంతో 8 వేలమంది కార్మికుల కోసం తలపెట్టిన భవనాల నిర్మాణాన్ని నిలిపివేశారు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే మక్కా మసీదు విస్తరణ పనులు కూడా ఆగిపోయాయి. మక్కాలో కరోనా నియంత్రణకు సౌదీ అత్యధిక ప్రాముఖ్యం ఇస్తుంది. ఎందుకంటే పవిత్ర మక్కా సంరక్షణ సౌదీ రాజకుటుంబం బాధ్యతల్లో అతిముఖ్యమైంది.


logo