శనివారం 30 మే 2020
International - May 13, 2020 , 08:28:59

సౌదీలో ఐదు రోజుల పాటు లాక్‌డౌన్‌

సౌదీలో ఐదు రోజుల పాటు లాక్‌డౌన్‌

హైదరాబాద్‌ : సౌదీ అరేబియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఇచ్చిన సెలవు దినాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఇంటీరియర్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. మే 23 నుంచి 27వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. రంజాన్‌ పూర్తయ్యే వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మక్కా మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యావసరాల నిమిత్తం ప్రజలకు అనుమతిచ్చారు.

సౌదీ అరేబియాలో 1,900లకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు సౌదీలో కరోనాతో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సౌదీ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


logo