బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 27, 2020 , 12:32:58

క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌క్కాకు నో ఎంట్రీ

క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌క్కాకు నో ఎంట్రీ

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది. ఈ విష‌యాన్ని ఇవాళ ఆ దేశ విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ఉమ్రా, మ‌హ్మాద్ ప్ర‌వ‌క్త మ‌సీదు ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే వారికి కొన్ని రోజుల పాటు వీసాల జారీని నిలిపివేయ‌నున్నారు.  ప్ర‌తి నెల వేల సంఖ్య‌లో ముస్లిం భ‌క్తులు ఉమ్రా ద‌ర్శ‌నం కోసం సౌదీ వ‌స్తుంటారు. చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. మ‌హమ్మారిగా విజృంభిస్తోంది. దీంతో అనేక ప్ర‌పంచ దేశాల్లో కోవిడ్‌19 మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  అయితే కొత్త వైర‌స్ ప్ర‌మాద‌క‌రంగా ఉన్న నేప‌థ్యంలో వీసాల జారీని తాత్కాలికంగా నిలిపేసిన‌ట్లు సౌదీ చెప్పింది.  దేశ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. క‌రోనా ప్ర‌బ‌లుతున్న దేశాల‌కు కూడా ఎవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని దేశ ప్ర‌జ‌ల‌కు సౌదీ సూచ‌న‌ చేసింది.


logo
>>>>>>