శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 22:21:21

ఖషోగ్గి హత్య కేసులో 8 మందికి జైలు శిక్ష విధింపు

ఖషోగ్గి హత్య కేసులో 8 మందికి జైలు శిక్ష విధింపు

ఇస్తాంబుల్ : సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో ఎనిమిది మందికి ఏడు నుంచి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని రాజ్య ప్రభుత్వ అల్ అల్ ఎఖబరియా టీవీ సోమవారం వెల్లడించింది. జమాల్ ఖషోగ్గి హత్య ేసులో ఐదుగురికి 20 సంవత్సరాల జైలుశిక్ష, ఒకరికి 10 సంవత్సరాల జైలుశిక్ష, ఇద్దరు వ్యక్తులకు ఏడేండ్ల జైలుశిక్ష విధించినట్లు ఎఖబరియా నివేదించింది. 59 ఏళ్ల జమాల్ ఖషోగ్గి.. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు వార్తలు రాశారు.

ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో జమాల్ ఖాషోగ్గి 2018 అక్టోబర్ 2 న కనిపించకుండా పోయాడు. అతడిని కాన్సులేట్ లోపల హత్య చేసినట్లు టర్కీ అధికారులు తరువాత వెల్లడించారు. అతడి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లేకుండా పోయింది. "కేసును శాశ్వతంగా మూసివేస్తున్నాం" అని వాషింగ్టన్ డీసీలోని అరబ్ సెంటర్కు చెందిన ఖలీల్ జహ్షాన్, ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది.

హత్యకు ఆదేశించడంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్రపై ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. అనేక పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ ఆపరేషన్ గురించి బిన్ సల్మాన్ కు ముందే తెలుసునని సూచించాయి. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బిన్ సల్మాన్ స్పష్టంచేశారు.


logo