శుక్రవారం 03 జూలై 2020
International - May 25, 2020 , 15:27:11

ఫుడ్‌ మెనూలిస్ట్‌లో ఫర్నిచర్‌ పేర్లు! వైరల్‌

ఫుడ్‌ మెనూలిస్ట్‌లో ఫర్నిచర్‌ పేర్లు! వైరల్‌

సౌదీ అరేబియాలోని ఒక హోటల్‌లో ‘లగ్జరీ సోఫా’, ‘ఫ్రైడే’, ‘ఎగ్స్‌ ఆఫ్‌ ఓవెన్‌’ వంటి ఇంట్లోని ఫర్నిచర్‌, వస్తువుల పేర్లు ఆహార మెనూ లిస్ట్‌లో ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఈ మెనూ అరబిక్‌ భాషతో పాటు అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చారు. అరబిక్‌ ఎలాగూ అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్‌లో ఉన్న పేర్లను చదివి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

‘లాక్‌డౌన్‌ కారణంగా మా తల్లి స్నేహితురాలి భర్త సౌదీ అరేబియాలోని ఒక హోటల్‌లో ఇరుక్కుపోయాడు. ఫుడ్‌ ఆర్డర్‌ చేయడానికి కాల్‌ చేస్తే అక్కడ సిబ్బంది ఒక మెనూలిస్ట్‌ ఇచ్చారు. అందులో అరబిక్‌ భాషతోపాటు ఇంగ్లీష్‌లో కూడా అర్థమయ్యేలా ఇచ్చారు. అతనికి అరబిక్‌ లాంగ్వేజ్‌ అర్థంకాక ఇంగ్లీష్‌లో ఉన్న పేర్లు చదివి ఖంగుతిన్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్‌కు తెలియజేశాడు. అరబిక్‌ భాష తెలిసిన వాళ్లు మెనూలో ఉన్న పేర్లకు అర్థం చెప్పండంటూ’ ట్విటర్‌ యూజర్‌ ఫొటో షేర్‌ చేశారు. దీనికి కొంతమంది ఫన్సీ కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు. కొంతమంది వాటిని పూర్తి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

  

 


logo