సోమవారం 01 జూన్ 2020
International - May 17, 2020 , 04:57:20

సౌదీ అరేబియాలో 50వేలు దాటిన కరోనా కేసులు

సౌదీ అరేబియాలో 50వేలు దాటిన కరోనా కేసులు

రియాద్‌: సౌదీ అరేబియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,840 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, 10 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,016కు చేరుకోగా, మృతుల సంఖ్య 302కు చేరుకుంది. చికిత్స అనంతరం 23,666 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపింది. సౌదీ పరిశ్రమల, సహజ వనరుల శాఖ మంత్రి బందర్‌ బీన్‌ ఇబ్రహీం అల్‌ ఖోరైప్‌ ఇటీవల మాట్లాడుతూ... కరోనా వైరస్‌ ప్రపంచ వాణిజ్య ఆకృతిని మార్చింది. వైరస్‌ వ్యాప్తి తరువాత వాణిజ్యంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్నారు.


logo