గురువారం 04 జూన్ 2020
International - Apr 29, 2020 , 17:18:36

బోటు విహారంలో కిమ్

బోటు విహారంలో కిమ్

ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింద‌ని ఇటీవ‌ల పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఓ మిసైల్ టెస్టింట్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డార‌ని కూడా వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ఆయ‌న దేశంలో ఎక్కడ ఉన్నార‌న్న‌దానిపై మాత్రం రోజుకో కొత్త క‌థ‌నం వినిపిస్తున్న‌ది. తాజాగా కిమ్ వూన్‌స‌న్ ప్రావిన్స్‌లో స‌ముద్ర‌తీరంలో ఓ రిసార్టులో ఉన్నార‌నే వార్త చ‌ర్క‌ర్లు కొడుతున్న‌ది. ఈ నెల 15 నుంచి కిమ్ ఎలాంటి అధికారిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌కుండా మాయం కావ‌టంతో ఆయ‌న ఆరోగ్యంపై వ‌దంతులు వ‌చ్చాయి. తాజాగా తీసిన ప‌లు శాటిలైట్ చిత్రాల్లో కిమ్ సాధార‌ణంగా ఉప‌యోగించే విహార ప‌డ‌వ‌లు వూన్‌స‌న్ ప్రాంతంలో క‌నిపించాయి. దాంతో ఆయ‌న అక్క‌డే ఉన్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 


logo