బుధవారం 03 మార్చి 2021
International - Feb 18, 2021 , 11:00:20

500 ఆయిల్ ట్యాంక‌ర్లు ధ్వంసం..

500 ఆయిల్ ట్యాంక‌ర్లు ధ్వంసం..

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్థాన్‌, ఇరాన్ స‌రిహ‌ద్దులోని హెరాత్ ప్రావిన్స్‌లో ఈ నెల 13న భారీ పేలుడు సంభ‌వించింది. ఇందులో 500కుపైగా ఆయిల్ ట్యాంక‌ర్లు ధ్వంస‌మ‌య్యాయి. అయితే ఈ విధ్వంసానికి సంబంధించి అంత‌రిక్షంలోని ఓ శాటిలైట్ త‌న హైరెజ‌ల్యుష‌న్ కెమెరాతో తీసిన ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మ‌క్స‌ర్‌కు చెందిన వ‌ర‌ల్డ్‌వ్యూ-3 శాటిలైట్ బుధ‌వారం ఈ ఫొటో తీసింది. ఈ పేలుడులో స‌హ‌జ వాయువు, ఇంధ‌నంతో ఉన్న 500కుపైగా ట్ర‌క్కులు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఈ పేలుడు ఎంత భారీగా ఉందంటే.. దీని ధాటికి ఇరాన్ నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్ ప‌వ‌ర్ స‌ర‌ఫ‌రాను నిలిపేయాల్సి వ‌చ్చింది. దీంతో హెరాత్ న‌గ‌రం మొత్తం అంధ‌కార‌మైంది. ఈ పేలుడు వ‌ల్ల సుమారు 5 కోట్ల డాల‌ర్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఊహించిన దాని కంటే ఇది చాలా పెద్ద ప్ర‌మాద‌మేన‌ని హెరాత్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ చీఫ్ యూన‌స్ ఖాజీ జాదా చెప్పారు. 

VIDEOS

logo