శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 16:47:27

మీల్స్‌ ఆన్‌ హీల్స్‌.. ఒక్క ఫోన్‌ చేస్తే ఇంటికి డ్రాగ్‌ క్వీన్స్‌ మీల్స్‌ తీసుకొస్తారు!

మీల్స్‌ ఆన్‌ హీల్స్‌.. ఒక్క ఫోన్‌ చేస్తే ఇంటికి డ్రాగ్‌ క్వీన్స్‌ మీల్స్‌ తీసుకొస్తారు!

న్యూయార్క్‌: డ్రాగ్‌ క్వీన్స్‌..మహిళా వేషధారణలో క్లబ్‌లలో పాటలు పాడుతూ..డ్యాన్స్‌ చేసే పురుషులు. కొవిడ్‌ నేపథ్యంలో క్లబ్‌లు మూతపడడంతో వీరికి ఉపాధి కరువైంది. క్లబ్‌ యజమానులకు కష్టాలు తప్పడం లేదు. దీంతో ఓ క్లబ్‌ యజమాని వినూత్న ఆలోచన చేశాడు. భోజనాన్ని హోమ్‌ డెలివరీ చేసేందుకు ఈ డ్రాగ్‌ క్వీన్స్‌ను వాడుకుంటున్నాడు. దీంతో వ్యాపారం మళ్లీ పుంజుకోవడంతోపాటు డ్రాగ్‌ క్వీన్స్‌కూ ఉపాధి లభిస్తోంది.

యూఎస్‌లోగల శాన్‌ఫ్రాన్సిస్కో ఒయాసిస్‌ క్లబ్‌ ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దీని యజమాని డీఆర్సీ డ్రోలింగర్ తన వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు ‘డ్రాగ్‌ క్వీన్స్‌’ను వాడుకుంటున్నాడు. ‘మీల్స్‌ ఆన్‌ హీల్స్‌’ పేరుతో వినియోగదారుల ఇంటికి భోజనాన్ని పంపే ఏర్పాట్లు చేశాడు. నగరంలోని ప్రసిద్ధ డ్రాగ్ క్వీన్స్ అమోరా టెస్సీ, కొచినా రూడ్‌తోసహా తొమ్మిది మంది ఇంట్లో వండిన ఆహారంతోపాటు కాక్‌టెయిల్‌ను వినియోగదారుల ఇంటికి తీసుకెళ్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. కొవిడ్‌తో క్లబ్‌లకు పోలేకపోతున్నామని బాధపడేవారు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. మంచి ఆలోచన అంటూ క్లబ్‌ యజమానిని మెచ్చుకుంటున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo