శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్‌కు 2.5 ఏళ్ల జైలుశిక్ష

సియోల్: దక్షణి కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో ఆయనకు ఈ శిక్షను విధించారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో స్మార్ట్ఫోన్లు అమ్మే సంస్థగా శాంసంగ్‌కు గుర్తింపు ఉన్నది. ఈ టెక్ కంపెనీ ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా తయారు చేస్తుంది. లంచాలు, నిధుల దుర్వినియోగం కేసుల్లో శాంసంగ్ మాజీ చీఫ్ లీ జే యాంగ్‌కు శిక్షను ఖరారు చేశారు. శాంసంగ్ అవినీతి కేసు వల్లే రెండేళ్ల క్రితం ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై తన పదవి కోల్సోవాల్సి వచ్చింది. విస్తృత స్థాయిలో అధికారులకు లంచాలు ఇచ్చినట్లు లీపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ దేశాధ్యక్షురాలు పార్క్ గెన్ అధికారాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శాంసంగ్ చీఫ్ ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ, అక్రమాలకు పాల్పడిన తీరు దురదృష్టకరమని కోర్టు పేర్కొన్నది. ప్రభుత్వ అనుమతుల కోసం భారీ స్థాయిలో శాంసంగ్ ముడుపులు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షురాలిపై ఆరోపణలు వచ్చాయి. అవినీతి కేసులో తొలుత సియోల్ కోర్టు లీకి అయిదేళ్ల శిక్ష విధించినా.. ఇప్పుడు ఆ శిక్షను కుదించారు.
తాజావార్తలు
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి
- ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై కేటీఆర్ బహిరంగ లేఖ
- అక్షర్ ట్రిపుల్ స్ట్రైక్..ఇంగ్లాండ్ 56/5
- మహిళ ఉసురు తీసిన అద్వాన రోడ్డు.. బస్సు కిందపడి మృతి
- ఆ గొర్రెకు 35 కిలోల ఉన్ని..
- గులాబీమయమైన దొంగలమర్రి..
- ప్రభాస్ రికార్డు..సినిమాకు 100 కోట్ల పారితోషికం..!
- ఈ లిఫ్టుల ద్వారా నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు : మంత్రి హరీశ్