శనివారం 28 నవంబర్ 2020
International - Oct 25, 2020 , 07:41:42

శామ్‌సంగ్‌ చైర్మన్‌ లీకున్‌ కన్నుమూత

శామ్‌సంగ్‌ చైర్మన్‌ లీకున్‌ కన్నుమూత

సియోల్‌ : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ కంపెనీ చైర్మన్‌ లీ కున్‌-హీ (78) కన్నుమూశారు. శామ్‌సంగ్‌ను ప్రంపచ దిగ్గజ సంస్థగా మార్చిన లీ.. 2014 గుండెపోటుతో మంచంపట్టారు. లీ మరణంపై కంపెనీ విచారం వ్యక్తం చేసింది. చైర్మన్‌ లీ నిజమైన దార్శనికుడని, శామ్‌సాంగ్‌ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్‌ టెక్‌ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చాడని సంస్థ కొనియాడింది. ‘అతని వారసత్వం శాశ్వతమైంది’ అని పేర్కొంది. కాగా, కంపెనీ టర్నోవర్‌ మొత్తం దక్షిణ కొరియా స్థూల జాతీయోత్పత్తిలో ఐదో వంతుకు సమానం. ఆ దేశ ఆర్థిక రంగానికి ఎంతో కీలకమైంది. కంపెనీకి ప్రస్తుతం లీ కున్‌-హీ తనయుడు లీ జే-యోగ్‌ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.