సోమవారం 25 జనవరి 2021
International - Dec 13, 2020 , 19:10:34

ఇతర వ్యాక్సిన్‌ తయారీదారులకు ‘స్పుత్నిక్‌ వీ’ డెవలపర్ల సహకారం

ఇతర వ్యాక్సిన్‌ తయారీదారులకు ‘స్పుత్నిక్‌ వీ’ డెవలపర్ల సహకారం

మాస్కో: కరోనాను ఎదుర్కొనే మొదటి టీకాను రష్యా నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటిదాకా ఇంకా ఏ టీకా కూడా రిజిస్టర్‌ కాలేదు. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ, యూకేకు చెందిన జీఎస్‌కే కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ‘స్పుత్నిక్‌ వీ’ డెవలపర్లు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ మేరకు రష్యా వ్యాక్సిన్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. 

క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న సీనియర్లలో తగినంత రోగనిరోధక ప్రతిస్పందన లేకపోవడంతో తమ వ్యాక్సిన్‌ ఆలస్యమవుతున్నదని సనోఫీ ప్రకటించింది. అందుకే తమ టీకా 2021 చివరలో అందుబాటులోకి రావచ్చని వెల్లడించింది. ఈ ప్రకటనకు ప్రతిస్పందనగా స్పుత్నిక్‌ డెవలపర్లు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ‘సనోఫీ, జీఎస్‌కే కంపెనీలు తమ తదుపరి వ్యాక్సిన్ల తయారీకి స్పుత్నిక్‌ వీ తన సాంకేతికతను అందజేస్తుంది. వేర్వేరు ఉత్పత్తిదారులుతో భాగస్వామ్యం ద్వారా భవిష్యత్‌కు మార్గం సుగమం చేద్దాం. అంతా కలిస్తేనే బలపడుతాం.’ అని స్పుత్నిక్‌ వీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo