శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 16, 2020 , 15:10:54

చైనాకు రష్యా రిటర్న్ గిఫ్ట్

చైనాకు రష్యా రిటర్న్ గిఫ్ట్

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తోంది. చైనాలోని వుహాన్‌లో పురుడు పోసుకున్న క‌రోనా వైర‌స్‌..ప్ర‌పంచ దేశాల‌న్నింటికి విస్త‌రించింది. దాదాపుగా అన్ని దేశాల్లో వైర‌స్ విజృంభిస్తోంది. ఎక్క‌డైతే క‌రోనా పుట్టిందో...అక్క‌డ ఇప్పుడు పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. అక్క‌డ లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో జ‌న‌జీవ‌నం మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరింది. అయితే తాజాగా అక్క‌డ మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ వ‌స్తుండ‌టం చైనాను క‌ల‌వ‌ర పెడుతుంది. ఎలాగంటే అక్క‌డ వారికి క‌రోనా సోక‌కున్నా విదేశాల నుంచి వ‌స్తున్న వారికి క‌రోనా పాజిటివ్ వ‌స్తోంది. 

ముఖ్యంగా రష్యా నుంచి వస్తున్న వారిలో మళ్లీ కేసులు మొదలయ్యాయి. వివిధ దేశాల నుంచి చైనాలోకి చొరబాట్లు జరిగిన కారణంగా తేలిన లెక్కల్లో రష్యా నుంచి వచ్చిన వారిలో 79 మందికి కరోనా ఉందని తేలింది. ఈ నేప‌థ్యంలో  చైనాకు  ర‌ష్యా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం మొదలెట్టేసిందని కొంద‌రు అంటున్నారు. ఇక వివిధ దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారి కారణంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్న నేప‌థ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వారి వివరాలు అందిస్తే నజరానా అందిస్తామని ప్రకటించింది. logo