బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 20:04:54

అమెరికాపై ర‌ష్యా మండిపాటు

అమెరికాపై ర‌ష్యా మండిపాటు

మాస్కో:  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) కు అమెరికా నిధులు ఆప‌డంపై ర‌ష్యా త‌ప్పుప‌ట్టింది. అమెరికా తీసుకున్న నిర్ణయం అత్యంత స్వార్ధపూరితమైందని మండిపడింది.  డబ్ల్యూహెచ్‌వోకు కొత్తగా ఎటువంటి నిధులు పంపేది లేదని  ట్రంప్ తేల్చిచెప్పిన నేప‌థ్యంలో... అమెరికా నిర్ణయాన్ని రష్యా తప్పుబట్టింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు దృష్ట్య ప్రపంచం మొత్తం డబ్ల్యూహెచ్‌వోవైపే చూస్తోందని, ఇలాంటి సమయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ సంస్థను దెబ్బతీస్తుందని విమర్శించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం.. అత్యంత స్వార్ధపూరితమైందని రష్యా పేర్కొంది. కాగా అమెరికా నిర్ణయాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా వ్యతిరేకించింది.


logo