గురువారం 13 ఆగస్టు 2020
International - Aug 01, 2020 , 19:46:57

రష్యాలో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

రష్యాలో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

మాస్కో : రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ దేశంలో 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 95 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రష్యాలో 8,45,443 మంది కరోనా బారినపడగా 6,38,410 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని 14,058 మంది మృతి చెందారని ఆ దేశ కరోనా ప్రతిస్పందనా కేంద్రం శనివారం తెలిపింది. శనివారం 5,462 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో 1,356 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది.  ఇదిలాఉండగా ఇవాళ మాస్కోలో 690 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలోని అన్నిప్రాంతాల్లోకెళ్లా మాస్కోలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 

తాజావార్తలు


logo