ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 09, 2020 , 17:00:11

రష్యాలో కరోనా విలయం

రష్యాలో కరోనా విలయం

మాస్కో : రష్యాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24గంటల వ్యవధిలో ఆ దేశంలోని 85 ప్రాంతాల్లో కొత్తగా 6509 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,778 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కరోనా వైరస్‌ ప్రతిస్పందన కేంద్రం తెలిపింది. 24గంటల వ్యవధిలో మాస్కోలో అత్యధికంగా 568 కేసులు నమోదైనా కేసుల పెరుగుదల శాతంలో మాత్రం ఆ నగరం చివరిస్థానంలో ఉందని అధికారులు పేర్కొన్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 24గంటల వ్యవధిలో 292 కరోనా కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఇప్పటి వరకు 7,07,301 కేసులు నమోదుకాగా 4,81,316 మంది చికిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఆ దేశంలో 176 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 10,843కు చేరింది.


logo