బుధవారం 03 జూన్ 2020
International - Apr 27, 2020 , 14:31:14

కరోనా విలయతాండవం.. చైనాను దాటేసిన రష్యా

కరోనా విలయతాండవం.. చైనాను దాటేసిన రష్యా

మాస్కో: రష్యాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆ దేశంలో సోమవారం కొత్తగా  6,198 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  అంతకుముందు రోజు కూడా 6,361 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 87,147కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 50 మంది కరోనా వల్ల చనిపోయారని రష్యా అధికారులు తెలిపారు.  అతిపెద్ద దేశం రష్యా కోవిడ్‌-19 కేసుల సంఖ్య కరోనా మహమ్మారి పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా( కరోనా కేసుల సంఖ్య 82,830)ను కూడా దాటేసింది. 


logo