సోమవారం 01 జూన్ 2020
International - May 14, 2020 , 13:55:06

రష్యాలో తగ్గిన కరోనా కేసులు

రష్యాలో తగ్గిన కరోనా కేసులు

మాస్కో: రష్యాలో గత 24 గంటల్లో 9974 కరోనా కేసులు నమోదయ్యాయి. మే 2 తర్వాత ఇంత తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, గత కొన్ని రోజులుగా పది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్న దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,52,245కే చేరింది. కరోనా వైరస్‌ వల్ల ఈ రోజు 93 మంది మరణించగా, దేశంలో మొత్తం మృతుల సంఖ్య 2305కి పెరిగింది. మొత్తం కరోనా కేసుల్లో 53,530 మంది బాధితులు కోలుకోగా, మరో 1,96,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కనోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో యూకేను వెనక్కినెట్టి రష్యా మూడో స్థానంలోకి వచ్చింది.  


logo