గురువారం 04 జూన్ 2020
International - Apr 21, 2020 , 17:10:15

రష్యాలో 50వేలు దాటిన కరోనా కేసులు

రష్యాలో 50వేలు దాటిన కరోనా కేసులు

మాస్కో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా సైతం అతలాకుతలమవుతోంది.  ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేల మార్క్‌ దాటింది. మంగళవారం వరకు దేశవ్యాప్తంగా 52,763 మందికి వైరస్‌ సోకింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,642 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు కరోనా బారినపడి 456 మంది చనిపోయారు. 


logo