శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 20:46:22

శుక్రగ్రహం మాదే:రష్యా..!

శుక్రగ్రహం మాదే:రష్యా..!

మాస్కో: భూమికి అతిదగ్గరలోఉన్న శుక్రగ్రహంపై ఏలియన్స్‌ ఉండవచ్చని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్నిరోజులకే ఆ గ్రహంపై రష్యా దేశం స్వయంప్రతిపత్తిని ప్రకటించింది. ఆ గ్రహాన్ని మొదట కనుగొన్నది తామేనని, అందుకే అది తమ సొంతమని అంటున్నది. మాస్కోలో జరుగుతున్న ఓ ప్రదర్శనలో రష్యన్ అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రి రోగోజిన్ వీనస్‌ను ‘రష్యన్‌ గ్రహం’ అని పిలిచారు. 

శుక్రగ్రహంపై విజయవంతంగా అడుగుపెట్టిన మొదటి, ఏకైక దేశం తమదేనని రోగోజిన్ వ్యాఖ్యానించారు. 60, 70, 80వ దశకంలో ఆ గ్రహంపైకి తాము వ్యోమనౌకలను పంపామని పేర్కొన్నారు. రష్యన్ వ్యోమనౌక గ్రహం గురించిన సమాచారాన్ని సేకరించిందని తెలిపారు. అలాగే, భవిష్యత్తులో అంతర్జాతీయ సహకారంతో సంబంధం లేకుండా స్వతంత్ర రష్యన్ యాత్రను ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించారు. అమెరికాతో సహకారంతో జరుగుతున్న వెనెరా-డి మిషన్‌కు అదనంగా ఈ యాత్ర ఉంటుందని తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.