శనివారం 05 డిసెంబర్ 2020
International - Oct 27, 2020 , 21:50:18

రూ.2.4 కోట్ల కారు.. కబాబ్‌లు తింటూ కాల్చేశాడు !

రూ.2.4 కోట్ల కారు.. కబాబ్‌లు తింటూ కాల్చేశాడు !

మనం ఎంతో ముచ్చపడి కొనుక్కున్న వాహనానికి ఏదైనా సమస్య వస్తే మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లి బాగుచేయించుకుంటాం. మరీ సమస్య ఎక్కువైతే ఏకంగా డీలర్‌కే అప్పగిస్తాం. మీరీ అంతగా ఇబ్బంది పెడితే ఎంతో కొంతకు అమ్మేసుకుంటాం. కానీ, రష్యాకు చెందిన ఓ వ్లాగర్‌.. దాదాపు 2.4 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్‌ కారును పెట్రోల్‌ పోసి కాల్చేశాడు. వీడేం తింగరబుచ్చోడురా బాబు! అని అనుకుంటున్నారు కదూ. నిజమేనండి. మీరూ ఆ వీడియోను వీక్షించండి.

మిఖాయిల్ లిట్విన్ అనే పేరుగల ఈ రష్యాకు చెందిన వ్యక్తి.. సాహసాలు, ఫ్రాంక్‌ వీడియోలు చేస్తూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటాడు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 కారును తగలబెట్టడాన్ని చిత్రీకరించాడు. లిట్విన్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో దాదాపు 5 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నారు. మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును తగులబెట్టిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారి రెండు రోజుల్లోనే 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

ఎంతో ప్రేమగా కొనుక్కున్న కారు తరుచూ బ్రేక్‌డౌన్‌ అవుతూ లిట్విన్‌ను ఇబ్బంది పెట్టిందంట. ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కారును కాల్చేయలన్న నిర్ణయానికొచ్చాడు. ఊరి చివర విశాలమైన ప్రాంతానికి తన కారును తీసుకెళ్లిన లిట్విన్‌.. డిక్కీ నుంచి డజన్‌కు పైగా గ్యాసోలిన్‌ కలిగివున్న బ్యారెల్స్‌ను దించాడు. నాలుగైదు బ్యారెల్స్‌ కారుపై గుమ్మరించిన తర్వాత.. మిగతా రెండు బ్యారెల్స్‌లోని గ్యాసోలిన్‌ను దాన్నుంచి కొద్దిదూరం వరకు ధారగా పోసుకుంటూ వెళ్లాడు. అనంతరం అక్కడ నింపాదిగా కూర్చుని కబాబ్‌లు తింటూ నిప్పంటించాడు. దాంతో మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు పూర్తిగా తగలబడిపోయింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.