సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 22:00:22

కోవిడ్ వ్యాక్సిన్‌.. ర‌ష్యా హ్యాకింగ్

కోవిడ్ వ్యాక్సిన్‌.. ర‌ష్యా హ్యాకింగ్

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న ఫార్మా కంపెనీల‌పై ర‌ష్యా గూఢ‌చారులు హ్యాకింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు బ్రిట‌న్, అమెరికా, కెన‌డా దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. ర‌ష్యా ఇంటెలిజెన్స్ గూఢ‌చారుల‌ త‌ర‌హాలో హ్యాక‌ర్లు దాడి చేసిన‌ట్లు బ్రిట‌న్‌కు చెందిన నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూర్టీ సెంట‌ర్ పేర్కొన్న‌ది. అయితే ఏయే ఫార్మా కంపెనీల‌ను టార్గెట్ చేశార‌న్న విష‌యాన్ని ఆ సంస్థ వెల్ల‌డించ‌లేదు. వ్యాక్సిన్ త‌యారీకి సంబంధించి ఎటువంటి స‌మాచారం లీకైంద‌న్న అంశం కూడా తేల‌లేదు. ర‌ష్యా హ్యాక‌ర్ల వ‌ల్ల‌ వ్యాక్సిన్ కోసం జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల‌కు ఎటువంటి విఘాతం క‌ల‌గ‌లేద‌న్న‌ది. బ్రిట‌న్‌, అమెరికా, కెన‌డా దేశాలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ర‌ష్యా కొట్టిపారేసింది. బ్రిట‌న్‌లోని ఫార్మా కంపెనీల‌ను హ్యాక‌ర్లు టార్గెట్ చేసిన‌ట్లు త‌మ ద‌గ్గ‌ర స‌మాచారం లేద‌ని, ఆ దాడుల‌తో ర‌ష్యాకు సంబంధం లేద‌ని అధ్య‌క్షుడు పుతిన్ ప్ర‌తినిధి దిమిత్రి పెస్క్వో తెలిపారు. అంత‌ర్జాతీయ సెక్యూర్టీ స‌ర్వీసుల గ్రూపులో ర‌ష్యా గూఢాచారుల హ్యాకింగ్ గురించి క‌థ‌నాన్ని ప్ర‌చురించారు.

   logo