శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 16:24:23

భ‌ర్త‌ను కాద‌ని కొడుకును పెళ్లి చేసుకున్న త‌ల్లి! ప్రేమ గుడ్డిద‌ని తెలుసు కానీ..

భ‌ర్త‌ను కాద‌ని కొడుకును పెళ్లి చేసుకున్న త‌ల్లి! ప్రేమ గుడ్డిద‌ని తెలుసు కానీ..

కొన్ని రిలేష‌న్ల‌ను చూడ‌గానే వ‌ళ్లు మండిపోతుంది. ఇక పెద్ద‌వాళ్ల‌యితే.. వీరిని చూసి ఇంకెంత‌మంది పాడ‌వుతార‌ని భ‌య‌ప‌డుతుంటారు. ఈ రిలేష‌న్‌ని చూసిన‌ప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. చెప్పుకోవ‌డానికి చిత్రంగా, అస‌హ్యంగా ఉన్న‌ప్ప‌టికీ త‌ల్లీ, కొడుకు పెళ్లి చేసుకోవ‌డం నిజం. కాక‌పోతే అబ్బాయి ఆమెకు పుట్టిన‌వాడు కాదు. ఆమె మాజీ భ‌ర్త కొడుకు. అంటే ఈమెకు స‌వ‌తి కొడుకు అన్న‌మాట‌. పైగా ఈ విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసింది.

రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏండ్ల‌ సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సార్ మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏండ్ల‌ అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే ప‌దేండ్ల‌ కొడుకు కూడా ఉన్నాడు. మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ప్రేమగా చూసుకునేది. అయితే, కొన్ని నెలల కిందట అర్రేతో మ‌న‌స్పర్థలు వ‌చ్చి ఇద్ద‌రు విడిపోయారు. కానీ పెంపుడు కొడుకు వ్లాడిమిర్ మ‌రీనాను మాత్రం వ‌ద‌లి ఉండ‌లేక‌పోయాడు. నిత్యం ఆమెను క‌లుస్తుండేవాడు. త‌ల్లి ప్రేమ కాస్త ప్రేయ‌సి ప్రేమ‌గా మారిపోయింది. కొన్నిరోజుల‌కు వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది త‌ల్లి కొడుకుల బంధం కాద‌ని తెలుసుకొని అత‌నికి చెప్పింది. అత‌ని మ‌న‌సులో కూడా అదే ఆలోచ‌న ఉండ‌డంతో ఇద్ద‌రు క‌లిసి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి అయిపోయేది. అప్ప‌టికే క‌రోనా వ‌చ్చి చేరింది. ఇన్ని రోజులు ఓపిక ప‌ట్టారు. ఇక ఉండ‌లేర‌ని రిజిస్ట‌ర్ ఆఫీస్‌లో పెళ్లి చేసేసుకున్నారు. వీరిద్ద‌రూ బాగానే ఉన్నారు. పాపం ఆమె మాజీ భ‌ర్త ప‌రిస్థితే దారుణం. క‌ట్టుకున్న భార్యే ఇప్పుడు ఇంటి కోడ‌లిగా వ‌స్తుంద‌ని తెలిసి గుండె ఆగినంత ప‌నైంది. ఏ చేస్తం కొడుకు ఆమెను వ‌దిలి ఉండ‌లేక‌పోతున్నాడు. చేసేదేం లేక అయిష్టంతోనే అంగీక‌రించాడు. వీరి రిలేష‌న్‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేయడానికి పెళ్లి డ్రెస్‌‌లోనే ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పెట్టింది. ఇది చూసిన కొంత‌మంది ఆమెను తిట్ట‌డం మొద‌లుపెట్టారు. మ‌రికొంత‌మందేమో అక్ర‌మ సంబంధాలు పెట్టుకోకుండా ఇలా ధైర్యంగా చెప్పి పెళ్లి చేసుకోవ‌డం గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

Принимаем поздравления и лайки???? Не дотерпели вы до вечера и завалили директ. Видео обычное. По делам покатались и заехали в Загс ???? Расчески не было. Кольца в машине. Зато было хорошее настроение и смущение. Мы очень какие-то лунтики на видео. Но вот так. Главное для меня не как, а за кого и с кем ????❤️ Вечером постараюсь залить фото в платье. Объявляю нас мужем и женой????( мы хотели немного наряднее????, но уже вечером)

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on


logo