శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 11:26:35

ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ న‌వాల్నిపై విష‌ప్ర‌యోగం

ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ న‌వాల్నిపై విష‌ప్ర‌యోగం

హైద‌రాబాద్‌: ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ న‌వాల్నిపై విష‌ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  అప‌మార‌క స్థితిలో ఉన్నఅత‌న్ని హాస్పిట‌ల్‌లో చేర్పించారు.  ర‌ష్యాలో అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మాన్ని న‌వాల్నీ నిర్వ‌హిస్తున్నారు. అయితే విమానంలో ప్ర‌యాణిస్తున్న ఆయ‌న‌.. అక‌స్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో విమానాన్ని ఓమ్స్క్‌లో ల్యాండ్ చేశారు.  న‌వాల్నీకి ఇచ్చిన టీలో విషం క‌లిపి ఉంటార‌ని అత‌ని ప్ర‌తినిధి పేర్కొన్న‌ది.  అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను.. న‌వాల్నీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రో రెండు ప‌ర్యాయాలు అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఇటీవ‌ల పుతిన్ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో భారీ కుట్ర జ‌రిగిన‌ట్లు న‌వాల్నీ ఆరోపిస్తున్నారు. న‌వాల్నీ ఉద‌యం నుంచి కేవ‌లం టీ మాత్ర‌మే తాగార‌ని, దాంట్లోనే ఏదో క‌లిపి ఉంటార‌ని అత‌ని ప్ర‌తినిధి యార్మ్‌షి పేర్కొన్న‌ది.  టోమ్స్క్ నుంచి మాస్కో వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
logo