నచ్చిన ఆహారం కోసం 725 కిలోమీటర్లు ప్రయాణించాడు..

Dec 03, 2020 , 16:52:20

మాస్కో: భోజనప్రియులు రుచికరమైన భోజనం కోసం ఏదైనా చేస్తారు. లాక్‌డౌన్‌ టైంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో మనల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తేశారు. కానీ చాలా రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోలేదు. దీంతో ఓ రష్యన్‌ మిలియనీర్‌ తనకు నచ్చిన బిగ్‌మాక్‌ అండ్‌ ఫ్రైస్‌ కోసం ఏకంగా25 కిలోమీటర్లు ప్రయాణించాడు. వాటికోసం 2,670 డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో  దాదాపు లక్షా 98వేలు ఖర్చుచేశాడు..

33 ఏళ్ల విక్టర్ మార్టినోవ్ రష్యాకు చెందిన మిలియనీర్‌. ఇతడికి మెక్‌ డొనాల్డ్‌ బర్గర్‌, బిగ్‌మాక్‌ అండ్‌ ఫ్రైస్‌ అంటే చాలా ఇష్టం. అయితే, విక్టర్‌ మార్టినోవ్‌ సెలవుదినాల్లో క్రిమియాలో ఉన్నాడు. అక్కడ మెక్డొనాల్డ్సలాంటి పాశ్చాత్య కంపెనీలపై నిషేధ ఆంక్షలున్నాయి. దీంతో మార్టినోవ్ ఈ ప్రాంతం నుంచి ఒక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని క్రాస్నోడర్‌ సమీపంలోని మెక్‌డొనాల్డ్‌కు వెళ్లాడు. 720 మైళ్లు ప్రయాణించి దాదాపు 2,680డాలర్లు ఖర్చు చేసి బిగ్ మాక్‌ అండ్‌ ఫ్రైస్‌ తీసుకొని తిరిగివచ్చాడు. ఈ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD