శనివారం 30 మే 2020
International - Apr 10, 2020 , 14:35:32

బోరు కొట్ట‌కుండా ప‌నిచేస్తూ డ్యాన్స్‌..వీడియో వైర‌ల్

బోరు కొట్ట‌కుండా ప‌నిచేస్తూ డ్యాన్స్‌..వీడియో వైర‌ల్

అగ్ర‌రాజ్యం అమెరికాతోపాటు ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హమ్మారి వ‌ణికిస్తోన్న నేప‌థ్యంలో..ఇపుడు ప్ర‌జలంతా స్వీయ‌నిర్బంధానికి ప‌రిమిత‌మ‌వ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో ఇంట్లో ఉండి బోరుగా ఫీల‌య్యే వారి కోసం సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్‌లోని మిఖైలోవ్‌స్కీ థియేట‌ర్స్ కు చెందిన ఏడుగురు డ్యాన్స‌ర్లు త‌మ ఇళ్ల‌లోనే ప‌నులు చేసుకుంటూ..ల‌డ్‌విగ్ మింక‌స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ను అనుస‌రిస్తూ..ఏడుగురు కిచెన్, గార్డెన్, ఇంటి ఆవ‌ర‌ణ‌లో హమ్ చేస్తూ వినోదాన్ని అందిస్తున్నారు.

ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  3 నిమిషాల ఈ వీడియోకు ఫేస్ బుక్ లో షేర్ చేయ‌గా 550 కామెంట్స్ వ‌చ్చాయి. ఇన్ స్టాగ్రామ్ లో 30 వేలు వ్యూస్ వ‌చ్చాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo