సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 02:03:08

‘స్పుత్నిక్‌-వీ’ ఉత్పత్తి ప్రారంభం

‘స్పుత్నిక్‌-వీ’ ఉత్పత్తి ప్రారంభం

మాస్కో: కరోనా చికిత్సకు తొలి టీకాగా రష్యా తీసుకొచ్చిన ‘స్పుత్నిక్‌-వీ’ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. తొలి విడుత డోసుల ఉత్పత్తి పూర్తయిందని, ఈ నెలాఖరుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు  వివరించింది. ఈ మేరకు ఇంటర్‌ఫ్యాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ వివరాలు వెల్లడించింది. డిసెంబర్‌-జనవరి నాటికి 50 లక్షల డోసులను సిద్ధం చేయనున్నట్టు పేర్కొంది. మరోవైపు, ప్రపంచదేశాల కంటే ముందే వ్యాక్సిన్‌ను తీసుకురావాలన్న ఆతృతతో సరైన ప్రమాణాలు పాటించకుండా టీకా ఉత్పత్తిని ప్రారంభించడంపై రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీకా అంశంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అది దేశ గౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. 


logo