సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 10, 2020 , 18:00:20

రాజ్‌నాథ్‌సింగ్‌కు భారత రష్యా రాయబారి శుభాకాంక్షలు

రాజ్‌నాథ్‌సింగ్‌కు భారత రష్యా రాయబారి శుభాకాంక్షలు

మాస్కో : భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 69వ జన్మదినం సందర్భంగా శుక్రవారం భారత రష్యా రాయబారి నికోలే కుదషేవ్‌ ఆయనకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజ్‌నాథ్‌సింగ్‌ చేస్తున్న ప్రతీ ప్రయత్నం విజయవంతమవ్వాలి. మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇటీవల మీరు సందర్శించిన మాస్కో నిజమైన రష్యన్-ఇండియన్‌ కామ్రేడరీ’ అని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో కుదషేవ్‌ పోస్టు చేశారు. గత నెలలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలో మూడురోజులపాటు పర్యటించారు. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్‌ విజయం సాధించి 75సంవత్సరాలు పూర్తవడాన్ని పురస్కరించుకొని నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు.  logo