సోమవారం 01 జూన్ 2020
International - Apr 30, 2020 , 15:05:26

రష్యాలో లక్ష దాటిన కరోనా కేసులు

రష్యాలో లక్ష దాటిన కరోనా కేసులు

మాస్కో: గత 24 గంటల్లో రష్యాలో కొత్తగా 7,099 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,06,498కి చేరింది. ఈ వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,074 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్యలో చైనా, ఇరాన్‌లను వెనక్కి నెట్టిన రష్యా లక్ష కరోనా పాజిటివ్‌లు దాటిన ఎనిమిదో దేశంగా నిలిచింది. అత్యధికంగా అమెరికాలో 10,64,572 కేసులు నమోదవగా, స్పెయిన్‌లో 2,36,899, ఇటలీలో 2,03,591, ఫ్రాన్స్‌లో 1,66,420 కరోనా కేసులు రికార్డయ్యాయి. 


logo