సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 22:33:55

రష్యా మరో ఘనత.. గాలిలో కరోనా వెరస్‌ను గుర్తించే యంత్రం అభివృద్ధి!

రష్యా మరో ఘనత.. గాలిలో కరోనా వెరస్‌ను గుర్తించే యంత్రం అభివృద్ధి!

మాస్కో: ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా మరో ఘనత సాధించింది. గాలిలో కరోనాతోపాటు ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియా, విషపదార్థాలను గుర్తించి అప్రమత్తం చేసే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది చిన్నమోతాదులో హానికారక సూక్ష్మజీవులను కూడా గుర్తించి, సెకన్లలోనే మనల్ని అప్రమత్తం చేస్తుందట.

కాగా, ఈ పరికరాన్ని వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ, గమేలియా ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో రష్యాకు చెందిన కేఎమ్‌జే ఫ్యాక్టరీ తయారు చేసింది. ‘డిటెక్టర్ బయో’గా పిలుస్తున్న ఈ పరికరాన్నిమాస్కో సమీపంలో జరిగిన ఆర్మీ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ 'ఆర్మీ 2020' సందర్భంగా ప్రదర్శించారు. అయితే, ఈ డిటెక్టర్‌ బయో ప్యాకెట్ సైజులో ఉండదు. రిఫ్రిజిరేటర్‌ మాదిరిగా ఉంటుంది. లేయర్‌ కేక్‌లాగా ఉండే ఈ నిర్మాణంలో చిన్న ల్యాబొరేటరీల శ్రేణి ఉంటుంది. ఇవి వివిధ పరీక్షలను నిర్వహిస్తుంటాయి. పరిసరాల్లోని గాలిని గ్రహించి రెండు స్థాయిలలో పరీక్షిస్తాయి. ఇందులో కరోనాలాంటి హానికారక సూక్ష్మజీవులుంటే వెంటనే సమాచారం అందించే వ్యవస్థ ఉంది. 

ఎలా పనిచేస్తుందంటే..?

మొదటి దశలో ఇది చుట్టుపక్కల గాలి నమూనాలను సేకరిస్తుంది. పది నుంచి పదిహేను సెకన్లలో వైరస్, బ్యాక్టీరియా లేదా టాక్సిన్ ఉంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అయితే, ఈ గాలిలో ఎలాంటి సూక్ష్మజీవులున్నాయో మాత్రం వెంటనే చెప్పదు. గాలిలోని పదార్థాలను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు విశ్లేషిస్తుంది. ఒకటి లేదా రెండు గంటల తర్వాత అందులో ఏ మైక్రోబ్స్‌ ఉన్నాయో తెలుపుతుంది. ప్రపంచంలోనే గాలిని విశ్లేషించే మొదటి పరికరం ఇది. దీన్ని ప్రధానంగా మెట్రో, రైల్వే స్టేషన్లు,  విమానాశ్రయాలతో సహా బహిరంగ ప్రదేశాల్లో అమర్చాలని డెవలపర్లు భావిస్తున్నారు.  

p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo