బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 17:27:04

ఈ వ‌జ్రం వ‌య‌సెంతో తెలుసా..?

ఈ వ‌జ్రం వ‌య‌సెంతో తెలుసా..?

న్యూఢిల్లీ: ర‌ష్యాలోని అల్రోసా అనే ప్ర‌ముఖ డైమండ్ కంపెనీకి ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రం దొరికింది. ఈ వ‌జ్రం అత్యంత అరుదైన‌ది మాత్ర‌మే కాదని, అత్యంత పురాతనమైనది కూడా అని అల్రోసా కంపెనీ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. రష్యాలో లభించిన ఈ వజ్రం విలువ కూడా అదేస్థాయిలో ఉంటుంద‌ని తెలిపారు. 236 క్యారెట్ల విలువైన ఈ వజ్రం ఈ మధ్యే వెలుగు చూసింది. యాకూటియాలోని తమ వజ్రపు గనుల్లో ఈ ముడివజ్రం దొరికినట్లు అల్రోసా కంపెనీ వెల్ల‌డించింది. 

ఇప్పటివ‌ర‌కు రష్యాలో లభించిన ప్రకృతిసిద్ధ ముడివజ్రాల్లో ఇదే అతిపెద్దదని అల్రోసా సంస్థ ప్రకటించింది. ప్రాథమిక ప‌రిశోధ‌న ప్రకారం ఈ వజ్రం కనీసం 12 నుంచి 23 కోట్ల సంవత్సరాల క్రితం నాటిద‌ని అల్రోసా ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo