శనివారం 06 జూన్ 2020
International - Apr 17, 2020 , 17:40:31

రష్యాలో కరోనా కట్టడికి హైడ్రాక్వీక్లోరోక్విన్‌: పుతిన్‌

రష్యాలో కరోనా కట్టడికి హైడ్రాక్వీక్లోరోక్విన్‌: పుతిన్‌

మాస్కో: కరోనా కట్టడికి మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉపయోగించాలని రష్యా నిర్ణయించింది. కరోనా వైరస్‌ ప్రభావిత రోగులకు చికిత్స అందించడానికి ఈ ఔషధాన్ని ఉపయోగించాలని ఆ దేశ ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారులను ఆదేశించారు. రష్యాకు 68 వేలకు పైగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్యాబ్లెట్ల ప్యాకెట్లను చైనా గతంలోనే అందించింది. అయితే ఈ ట్యాబ్లెట్లు కరోనా రోగులపై చూపే ప్రభావం, వారి భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించడానికి క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను ఉపయోగించడానికి రష్యా ముందుకు వచ్చింది. కరోనా వైరస్‌ సోకిన వారు త్వరగా కోలుకోవడానికి, వైరస్‌ అనుమానితులకు ఈ ట్యాబ్లెట్లను అందించాలని ఆయన పేర్కొన్నారు.


logo