ఆదివారం 29 మార్చి 2020
International - Jan 30, 2020 , 16:48:24

చైనా స‌రిహ‌ద్దును మూసివేసిన ర‌ష్యా

చైనా స‌రిహ‌ద్దును మూసివేసిన ర‌ష్యా

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో.. చైనాతో ఉన్న స‌రిహ‌ద్దును మూసివేస్తున్న‌ట్లు ర‌ష్యా పేర్కొన్న‌ది.  క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ర‌ష్యా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. చైనా దేశ‌స్థుల‌కు ఎల‌క్ట్రానిక్ వీసాలు ఇవ్వ‌డం లేద‌ని ఆ దేశం పేర్కొన్న‌ది. తూర్పు దిశ‌లో ఉన్న బోర్డ‌ర్‌ను మూసివేసేందుకు అగ్రిమెంట్ కుదిరిన‌ట్లు ర‌ష్యా ప్ర‌ధాని మిఖ‌యిల్ మిషుస్తిన్ తెలిపారు.  ప్ర‌జ‌ల్ని కాపాడుకునేందుకు వీలైన‌న్ని చ‌ర్య‌లు చేప‌ట్టక త‌ప్ప‌ద‌న్నారు. చైనాకు వెళ్ల‌వ‌ద్ద‌ని త‌మ దేశ‌స్థుల‌కు ర‌ష్యా వార్నింగ్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యాలో క‌రోనా పాజిటివ్ కేసులు ఏవీ న‌మోదు కాలేదు.  logo