బుధవారం 08 జూలై 2020
International - Jun 02, 2020 , 22:19:32

2036 దాకా రష్యా రారాజుగా పుతిన్‌!

2036 దాకా రష్యా రారాజుగా పుతిన్‌!

మాస్కో: ఒకవైపు ప్రపంచదేశాలను కరోనా వైరస్‌ భయపెట్టిస్తుండగా.. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు చర్యలు చేపట్టారు. చైనాను చూసి తాను కూడా అలాగే రారాజుగా వెలుగొందాలనే ప్రణాళికలు పుతిన్‌ సిద్ధం చేసుకొని ఆ మేరకు మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారు.  2036 వరకు తానే రష్యా అధ్యక్షుడిగా కొనసాగేలా రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు వచ్చే నెల ఒకటిన దేశవ్యాప్తంగా ఓటింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వీడియోకాల్‌ ద్వారా ఉన్నతాధికారులకు పుతిన్‌ ఆదేశాలిచ్చారు. 

వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించే ఓటింగ్‌లో పుతిన్‌ విజయం సాధించినపక్షంలో ఆయన పదవీకాలం మరో 12 ఏండ్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆయన పదవీకాలం 2024తో ముగుస్తుంది. ఇలాఉండగా, ఏప్రిల్‌ 22 తేదీన ఓటింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో రష్యా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నది. ఇక్కడ 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 8 వేల మందికి పైగా చనిపోయారు. 


logo