బుధవారం 20 జనవరి 2021
International - Nov 24, 2020 , 16:16:38

స్పుత్నిక్ టీకా ధ‌ర 10 డాల‌ర్లే..

స్పుత్నిక్ టీకా ధ‌ర 10 డాల‌ర్లే..

హైద‌రాబాద్‌: ర‌ష్యాకు చెందిన క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 95 శాతం ప్ర‌భావ‌వంతంగా ఉన్న‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. రెండ‌వ మ‌ధ్యంత‌ర ఫ‌లితాల‌కు సంబంధించిన నివేదిక‌ను స్పుత్నిక్ రిలీజ్ చేసింది.  అయితే టీకా తొలి డోసు తీసుకున్న 28 రోజుల్లో వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త 91.4 శాతంగా ఉంద‌ని, తొలి డోసు తీసుకున్న 42 రోజుల త‌ర్వాత దాని స‌మ‌ర్థ‌త 95 శాతంగా ఉన్న‌ట్లు స్పుత్నిక్ కంపెనీ వెల్ల‌డించింది.  ఇండియాలో స్పుత్నిక్‌తో క‌లిసి డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ ప‌నిచేస్తున్న‌ది. అయితే టీకా ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌లేద‌ని స్పుత్నిక్ వెల్ల‌డించింది.  అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఒక డోసు వ్యాక్సిన్ ధ‌ర‌ను ప‌ది డాల‌ర్లుగా నిర్ధారించిన‌ట్లు తెలుస్తోంది. భార‌త క‌రెన్సీలో స్పుత్నిక్ ధ‌ర సుమారు రూ. 750 ఉంటుంది. అంత‌ర్జాతీయ ఉత్ప‌త్తిదారుల‌తో వ్యాక్సిన్ ఉత్ప‌త్తిపై ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు ఆర్‌డీఐఎఫ్ పేర్కొన్న‌ది.  వ‌చ్చే ఏడాది లోగా సుమారు 500 మిలియ‌న్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ఆర్‌డీఐఎఫ్ చెప్పింది.logo