బుధవారం 03 జూన్ 2020
International - May 06, 2020 , 13:52:40

రష్యాలో వరుసగా నాలుగో రోజూ 10వేలకు పైగా కేసులు

రష్యాలో వరుసగా నాలుగో రోజూ 10వేలకు పైగా కేసులు

మాస్కో: కొద్దిరోజుల వరకు యూరప్‌ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రస్తుతం  ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యాను వణికిస్తోంది.  ఆ దేశంలో వరుసగా నాలుగోరోజూ 10వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,559 మందికి వైరస్‌ సోకింది. దీంతో రష్యాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 165,000కు పెరిగింది. ఒక రోజు వ్యవధిలో 86 మంది చనిపోవడంతో కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,537కు చేరుకున్నది. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. 


logo