మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 20, 2020 , 03:34:38

శుక్రగ్రహం మాదే! రష్యా ప్రకటన

శుక్రగ్రహం మాదే! రష్యా ప్రకటన

మాస్కో, సెప్టెంబర్‌ 19: శుక్ర గ్రహంపై జీవం ఉండేందుకు ఆస్కారమున్నట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన నేపథ్యంలో రష్యా వింత ప్రకటన చేసింది. శుక్రగ్రహం మీదకు     మొట్టమొదటగా మేమే వెళ్లామని, అది మాదేనని ప్రకటించుకున్నది. శుక్ర గ్రహాన్ని ‘రష్యా ప్లానెట్‌' అంటూ ఆ దేశ అంతరిక్ష సంస్థ అధిపతి ద్విమిత్రి రోగోజిన్‌ వ్యాఖ్యానించారు. 60,70,80వ దశకాల్లోనే తాము శుక్రగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు చేపట్టినట్లు చెప్పారు. 


logo