శుక్రవారం 05 జూన్ 2020
International - May 03, 2020 , 16:06:42

రష్యాలో కొత్తగా పదివేలకుపైగా కరోనా కేసులు

రష్యాలో కొత్తగా పదివేలకుపైగా కరోనా కేసులు

మాస్కో: రష్యాలో గత 24 గంటల్లో 10,633 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా దేశంలో ఒకేరోజు ఐదంకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఇందులో 5345 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,34,687కు చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 1,280 మంది మరణించారు. 16,639 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 34,40,904 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,43,922 మంది మరణించగా, 10,96,057 మంది కోలుకున్నారు.


logo