బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 15:42:08

రష్యాలో తగ్గుముఖం..అమెరికా, బ్రెజిల్‌లో తీవ్రత అధికం

రష్యాలో తగ్గుముఖం..అమెరికా, బ్రెజిల్‌లో తీవ్రత అధికం

మాస్కో:   ప్రపంచవ్యాప్తంగా  రష్యాతో  పాటు ఐరోపా వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది.  అతిపెద్ద దేశం రష్యాలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నది.  కరోనా దెబ్బకు అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ తదితర దేశాలు వణుకుతున్నాయి.  రష్యాలో  కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

గడచిన 24 గంటల్లో  రష్యాలో 5,842 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కరోనా రెస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది..  దాదాపు నెలరోజుల తర్వాత ఒకేరోజు తొలిసారి 6వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి.  ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య  7,83,328కు పెరిగింది.  24 గంటల్లో మరో 153 మంది  ప్రాణాలు కోల్పోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12,580కు పెరిగింది.

 ప్రపంచవ్యాప్తంగా  కరోనా కేసుల సంఖ్యలో రష్యా నాలుగో స్థానంలో ఉన్నది.   వరుసగా ఏడో రోజూ  అమెరికాలో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి


logo